అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
- August 04, 2024
ఈ సృష్టిలో మధురమైనది స్నేహం. ప్రేమకు ఆలవాలం స్నేహం. సంతృప్తికి నిలయం, త్యాగానికి ప్రతిరూపం స్నేహం. ఆస్తిపాస్తులతో సంబంధం పనిలేకుండా, లింగభేదం చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం ఇది. మనతో రక్త సంబంధం లేదు, బంధువు కాదు. ఇంట్లో వ్యక్తి కాదు అవసరం వస్తే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. అటువంటి స్నేహానికి గుర్తుగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
'స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం' ఇది అన్ని వేళలా, కాలాల్లో మనందరికి వినిపించే ఆరోక్తి. ఏంటో చెప్పు నేనున్నానంటూ భుజంపై చేయి వేస్తాడు. అసలు సంబంధమే లేని వ్యక్తి అయినా జీవితంలో ప్రతి చోట నీతోనే ఉంటాడు అతనే ఒక ఫ్రెండ్. స్నేహం ఎక్కడ మొదలవుతుందో తెలియదు. ఎందుకూ అనే ప్రశ్నే రాదు. కష్టమొస్తే కన్నీరు తుడుస్తాడు. సంతోషమొస్తే పంచుకుంటాడు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు ఇలా అన్ని బంధాలను దేవుడే ఇచ్చినా స్నేహితుడిని మాత్రం నువ్వే ఎంచుకోమని పంపిస్తాడు.
ఇంతటి మధురమైన అనుబంధం కాబట్టే దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఆ రోజున స్నేహితులంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతారు. మరుసటి ఏడాది వరకూ గుర్తుండిపోయే మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. మన జీవితాలను సుసంపన్నం చేసే సంబంధాలలో స్నేహితులు భాగమే.. స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందంటే హాల్మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు హిస్టరీ జాయిస్ హాల్ స్నేహానికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించారు.
ఐక్యరాజ్యసమితి జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించడంతో స్నేహితుల దినోత్సవం సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ భారత దేశం ఆగష్టు మొదటి వారం జరుపుకుంటుంది. దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలకు ఇది స్ఫూర్తినిస్తుందని, సమాజాల మధ్య వారధులను నిర్మించగలదనే ఆలోచనతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రకటించిం పేర్కొంది.
అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!