భూమికి దూరమైపోతున్న చంద్రుడు..

- August 04, 2024 , by Maagulf
భూమికి దూరమైపోతున్న చంద్రుడు..

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనకు తెలిసిన విషయమే. భూమి ఒకసారి సూర్యుడు చుట్టూ తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే గత కొంతకాలంగా ఆ వేగం గణనీయంగా తగ్గుతుందా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు నెమ్మదిగా దూరమవుతున్నాడని.. తద్వారా రానున్న 20 లక్షల ఏళ్లలో భూమిపై ఒక రోజుకి 25 గంటలుగా మారుతుందని శాస్త్రవేత్తల అధ్యాయంలో వెల్లడైంది. 

చంద్రుడు సంవత్సరానికి దాదాపు 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరం కుదులుతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే భూమిపై ఒక రోజు 25 గంటలు ఉంటుంది. అయితే తాజాగా నిర్వహించిన శాస్త్రీయ అధ్యాయనంలో ఎటువంటి విషయాలు వెళ్లడయ్యాయి..? చంద్రుడు సంవత్సరానికి ఎన్ని సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరంగా కదులుతున్నాడు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడు చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని.. అప్పుడు ఒక రోజుకు 25 గంటలు అయ్యే అవకాశం ఉందని యూనిక్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఇది ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం లేదు. 14 లక్షల సంవత్సరాల క్రితం రోజుకు 18.41 గంటలు ఉండేది. ఈ లెక్కన మరో 20 కోట్ల సంవత్సరాల్లో భూమిపై రోజుకు 25 గంటలు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్షిన్ - మాడిసన్ కి చెందిన ఒక బృందం.. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడిలో జరుగుతున్న మార్పులపై పరిశోధనా నివేదికను విడుదల చేసింది. 

ఈ పరిశోధన బృందం 90 మిలియన్ సంవత్సరాల పురాతనమైన రాతి నిర్మాణంపై దృష్టి సారించింది. ఇది భూమి నుంచి చంద్రుని మధ్య జరుగుతున్న డ్రిఫ్టింగ్ ని గుర్తించగలదు. ఈ నివేదిక ప్రకారం చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరంగా కదులుతున్నాడు. ఈ కారణంగా మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ విషయాన్ని వారు భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పులను అంచనా వేసినట్లు తెలిపారు. భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల మనకు రాత్రి, పగలు ఏర్పడుతున్నారు. అలా పగలు, రాత్రిని కలిపి మనం ఒకరోజుగా భావిస్తున్నాం. చంద్రుడి పరిభ్రమణ సమయాన్నిబట్టి ప్రస్తుతం రోజుకు 24 గంటలుగా నిర్ణయించారు. ఇప్పుడు చందమామ దూరం వెళుతుండడంతో భవిష్యత్తులో ఈ కాలమానం మారిపోయి.. రోజుకు 25 గంటలు అవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

--సాయికృష్ణ (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com