కోల్‌కతాని ముంచెత్తిన వరదలు..
- August 04, 2024
కోల్‌కతా: కోల్‌కతాని భారీ వరదలు మొచ్చేత్తాయి. దీంతో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. విమానాశ్రయ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయం రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. కోల్‌కతాతోపాటు పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్‌లో కుండపోత వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!