హైదరాబాద్‌లో ఘరానా మోసం
- August 04, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి ఈ మెసేజ్ లను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మనం పూర్తిగా నిండా మోనిగిపోయినట్టే.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి గ్రూపులో యాడ్ అయిన ఇద్దరి వ్యక్తుల నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసిన సైబర్ కేటుగాళ్లు.. దశలవారీగా డబ్బులను తమ అకౌంట్లో వేయించుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నామని అధిక లాభాలు వచ్చాయని సాఫ్ట్వేర్ లో చూపెడుతూ మోసం చేసిన తీరు పటాన్ చెరు ఇద్దరు యువకుల దగ్గర నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలని వారం రోజులు పరిధిలోని సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు.
వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో 45 రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి క్లిక్ చేశాడు. దీంతో అతడు సైబర్ నేరస్థులు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా మారాడు. అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు సూచించడంతో పెట్టుబడి పెట్టాడు. వారు ఒక పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలు అంటూ అందులోనూ చూపించారు. ఇలా 22 దఫాలుగా రూ.2.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరస్థులు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మరొక కేసులో యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో మరో వ్యక్తి కూడా వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా రూ.66.75 లక్షల పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన







