హీరా గోల్డ్: మరో 400 కోట్లు స్వాహా
- August 05, 2024
హైదరాబాద్: తాజాగా హీరా గోల్డ్ లో ఈడీ సోదాలు ముగిసాయి. నౌ హీరా షేక్ 400 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు ఈడి నిర్వహించారు. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో నౌ హీరా షేక్ వసూళ్లు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడి.
38% వడ్డీ ఇస్తానంటూ భారీ వసూలుకు నౌహీరా షేక్ పాల్పడ్డాడు. ఈ దాడులలో 12 అధునాతన లగ్జరీకారులను స్వాధీన పరుచుకుంది ఈడి. అలాగే 90 లక్షల రూపాయల నగదును స్వాధీన పరుచుకుంది. నౌ హిరా షేక్ మీద 13 ఆస్తుల పత్రాలు, బినామీ పేర్ల మీద 11 ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 45 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా యూఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించ్చారు అధికారులు. అధిక వడ్డీ, బంగారం పేరు తోటి వసులోకి పాల్పడ్డాడు నౌ హీరా షేక్. గతంలోనూ నౌహీరా షేక్ ని అరెస్టు చేసారు ఈడి అధికారులు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







