తమలపాకులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
- August 05, 2024
తమలపాకును కేవలం పూజాధికాల్లోనే కాకుండా వైద్య పరంగానూ ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం వుంది.
ఆయుర్వేదంలో తమలపాకును అనేక రకాల మందుల తయారీలో విరివిగా వాడతారు. ముఖ్యంగా దంత సమస్యల నుంచి ఉపశమనం పొందే మందుల్లో తమలపాకును వుపయోగిస్తారు.
అలాగే శ్వాస కోశ సంబంధిత ఔషధాల తయారీలోనూ తమలపాకును వినియోగిస్తారు. అతేకాదు, తమలపాకును ప్రతీరోజూ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలేమైనా వుంటే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీన్ని తీసుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతి ఏమీ అవసరం లేదు. ప్రతీ రోజూ పరగడుపున ఒక తమలపాకును తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుండడంతో పాటూ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయ్.
అలాగే, బరువు సమస్య వున్న వాళ్లకీ తమలపాకు మంచి ఔషధంగా చెబుతున్నారు. తమలపాకు రసం తీసుకుని తాగితే చాలా సులువుగా ఎటువంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.
జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు తమలపాకు రసం వేసిన గోరువెచ్చని నీటిని తాగితే చిటికెలో ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







