అందుబాటులోకి వచ్చిన 'IIFA ఉత్సవం 2024' టిక్కెట్లు
- August 06, 2024
అబుదాబి: షేక్ నహయాన్ మబారక్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఫర్ టాలరెన్స్ అండ్ కోఎక్సిస్టేన్స్), మార్గనిర్దేశకత్వంలో IIFA ఉత్సవం 2024 అసాధారణమైన రెండు రోజుల వేడుకగా నిలువనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IIFA ఉత్సవం 2024, అబుదాబి సాంస్కృతిక, పర్యాటక శాఖ,మిరల్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతోంది. IIFA ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబర్ 6వ, 7, 2024న జరుగనుంది. తెలుగు, కన్నడ చిత్రాల కేటగిరీ కోసం IIFA ఉత్సవం 2024 హోస్ట్‌లు ఎంపికయ్యారు.
రానా దగ్గుబాటి: తెలుగు కేటగిరీకి హోస్ట్ కాగా, విజయ్ రాఘవేంద్ర, అకుల్ బాలాజీ కన్నడ ఫిల్మ్ కేటగిరీకి హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. IIFA ఉత్సవం 2024లో రాక్‌స్టార్ DSP & రకుల్ ప్రీత్ సింగ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ, “IIFA ఉత్సవం దక్షిణ భారత సినిమాకి నిజమైన వేడుక. నేను అందులో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను" అని అన్నారు. అకుల్ బాలాజీ, విజయ్ రాఘవేంద్ర మాట్లాడుతూ, “IIFA ఉత్సవం 2024లో కన్నడ ఫిల్మ్ కేటగిరీని హోస్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాము" అని అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ , రాక్‌స్టార్ DSP, నటి శ్రీలీల మాట్లాడుతూ, “ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వేదిక. ఈ సెప్టెంబర్‌లో యాస్ ఐలాండ్, అబుదాబిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నాము." అని అన్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో IIFA ఉత్సవం గ్లోబల్ టూర్ కోసం టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్ న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
ఈ ఈవెంట్ టిక్కెట్ల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://abu-dhabi.platinumlist.net/event-tickets/91813/iifa-utsavam-2024-at-etihad-arena-abu-dhabi
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!