ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం

- August 06, 2024 , by Maagulf
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకుంది. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. రేపటికి కేసును వాయిదావేస్తూ, ఆరోజు తుది విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించుకున్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జూలై 6న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, చార్జ్ షీట్లో తప్పులేమీ సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్ ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

ఇదిలాఉంటే.. లిక్కర్ మనీలాండరింగ్  కేసులో కవిత అరెస్ట్ అయ్యి ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న కవితతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ములాఖత్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com