‘గేమ్ ఛేంజర్’ స్పీడు పెంచారుగా.!
- August 07, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న సినిమానే ‘గేమ్ ఛేంజర్’. మెగా అభిమానుల ఆశలన్నీ ఈ సినిమా పైనే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ‘ఆచార్య’ డిజాస్టర్ రిజల్ట్ ఇవ్వగా ‘గేమ్ ఛేంజర్’ పైనే అంచనాలు క్రియేట్ అయ్యాయ్. ‘బారతీయుడు 2’ డిజాస్టర్ కావడంతో, ‘గేమ్ ఛేంజర్’ పైనే శంకర్ ఎక్కువగా ఫోకస్ పెట్టుంటాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.
ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. కానీ, ఇంతవరకూ వచ్చిన ‘జరగండి జరగండి’ పాటలో చరణ్ కాన్ఫిడెన్స్ మాత్రమే జనం చూశారు.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ రిలీజ్ కానుందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అలాగే, ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయ్.
దాదాపు 70 శాతం పూర్తి చేసుకున్నసినిమా నిర్మాణం మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసి, నిర్మాణానంతర పనుల్లో బిజీ కానుంది చిత్ర యూనిట్. కైరా అద్వానీతో పాటూ, తెలుగమ్మాయ్ అంజలి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎస్.జె.సూర్య మెయిన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. అలాగే దిల్ రాజు, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







