నిహారిక నిర్మాతగానైనా రాణిస్తుందా.?
- August 07, 2024
మెగా డాటర్ నిహారిక వెండితెరపై వెలిగిపోవాలనుకుంది కానీ, ఎందుకో ఏమో ఆ కోరిక తీరడం లేదు నిహారికకు. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అయినా ప్రయత్నిస్తూనే వుందనుకోండి.
ఆ ప్రయత్నాలు అలా వుండగానే.. నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకోవాలనుకుంది. ఇంతవరకూ షార్ట్ ఫిలింస్‌కి మాత్రమే నిర్మాతగా వ్యవహరించిన నిహారిక తొలిసారి ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది.
అదే ‘కమిటీ కుర్రోళ్లు’. అచ్చమైన గోదావరి పల్టెటూరి వాతావరణంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఓ ఊరిలోని 11 మంది కుర్రాళ్ల కథే ఈ ‘కమిటీ కుర్రోళ్లు’. ప్రచార చిత్రాలు బాగున్నాయ్.
వినోదంతో పాటూ, అందరికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ అలాగే యాక్షన్ ఇలా అన్ని రకాలూ పుష్కలంగా కలగలిపిన కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘మా అన్నయ్యకి ఆస్కార్ దక్కింది. మా పెదనాన్నకి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్‌కి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది.. నాకు కూడా ఈ సినిమాతో నిర్మాతగా ఓ సూపర్ హిట్ ఇచ్చేయండ్రా బాబూ..’ అంటూ నిహారిక ప్రమోషన్లు ఊదరగొడుతోంది.
11 మంది హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్లలో నటుడు ఆది కూడా తనదైన పంచ్ డైలాగులతో ఆసక్తి క్రియేట్ చేస్తున్నాడు. సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. రిజల్ట్ ఎలాంటిది దక్కుతుందో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!