‘మిస్టర్ బచ్చన్’ వెర్సస్ ‘డబుల్ ఇస్మార్ట్’.! గెలుపెవరిదో కానీ.! మోత గట్టిగానే
- August 07, 2024
ఈ ఆగస్టు 15న రెండు పెద్ద సినిమాలతో పాటూ, చిన్నా చితకా సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా వున్నాయ్. ‘కల్కి’ సినిమా తర్వాత వచ్చిన ‘భారతీయుడు 2’ భారీ చిత్రం నిరాశపరచడంతో ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ పడలేదు బాక్సాఫీస్ వద్ద పోరుకి.
ఆ లోటును ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు తీర్చేయనున్నాయ్. రెండు సినిమాల పైనా అంచనాలు బాగానే వున్నాయ్. ప్రమోషన్లు కూడా ఇద్దరూ పోటీగానే చేస్తున్నారు.
గ్లామర్‌లోనూ పోటీ గట్టిగానే వుంది అటు కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే, ఇటు కావ్య థాపర్ ఇద్దరూ ఇద్దరే. ఇక మాస్ విషయానికి వస్తే.. రామ్ పోతినేని, ఇటు మాస్ మహరాజ్ రవితేజ.. డైరెక్టర్లూ గట్టోల్లే.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సమవుజ్జీలే ఈ రెండు సినిమాలకీ. ఇక గెలుపెవరిదన్నది మాత్రం ప్రేక్షకులే తేల్చాల్సి వుంది. సగటు ప్రేక్షకుడిగా సినిమా కళకళలాడాలంటే రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవాలి.
అయితే, ఫైనల్ రిజల్ట్ ఎలా వుంటుందనేది మాత్రం ప్రేక్షకుల డెసిషన్‌కే వదిలేయాలి. మరి కొద్ది రోజుల్లోనూ అది తేలిపోనుంది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







