దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న షార్జా నివాసి
- August 08, 2024
యూఏఈ: బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాంకోర్స్ సిలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో కెనడియన్ జాతీయుడిని మిలియనీర్‌గా ప్రకటించారు. షార్జాలో ఉన్న కెనడియన్ హిషామ్ అల్షెల్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 470లో టికెట్ నంబర్ 4481తో $1 మిలియన్ విజేతగా నిలిచాడు. అతను జూలై 24న టర్కీలోని ఇస్తాంబుల్‌కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు. 199 నుండి మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్‌ను గెలుచుకున్న 10వ కెనడియన్ జాతీయురాలు అయిన అల్షెల్హ్ ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రియా సోమీ.. దుబాయ్‌లో ఉన్న 35 ఏళ్ల భారతీయ జాతీయురాలు. ఆమె జూలై 18న న్యూఢిల్లీకి వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ సిరీస్ 1887లో టికెట్ నంబర్ 0533తో రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ HSE P400 (శాంటోరిని బ్లాక్) కారును గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్. సోమీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. "నేను ప్రస్తుతం నమ్మలేకపోతున్నాను. కానీ దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు." అని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







