నోటిలొ పుండ్లు-ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం.!
- August 09, 2024
విటమిన్ బి, సి లోపించడం కారణంగా నోటిలో పుండ్లు వస్తుంటాయ్. ఇవి కొందరికి రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమైపోతుంటాయ్. ఇంకొందరిలో వారం రోజుల వరకూ ఇబ్బంది పెడుతుంటాయ్.
ఏమీ తిననివ్వవు. మాట్లాడనివ్వవు. చుక్కలు చూపిస్తుంటాయ్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందడమెలా.? వైద్యుని సంప్రదిస్తే విటమిన్ ట్యాబ్లెట్లు ప్రిఫర్ చేస్తారు. కానీ, రెండు మూడు రోజులు మాత్రం వీటితో ఇబ్బంది పడాల్సిందే.
అయితే, ట్యాబ్లెట్ల జోలికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశాలున్నాయ్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కాస్త కళ్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలిస్తే ఉపశమనం వుంటుంది. రోజులో మూడు సార్లయినా ఇలా చేయాల్సి వుంటుంది.
చిటికెడు పసుపును తీసుకుని ముద్దగా చేసి పుండుపై పెట్టినా ఉపశమనం వుంటుంది. అలాగే బేకింగ్ సోడా కలిపిన వాటర్ పుక్కిలించినా ఫలితం వుంటుంది.
కాస్త తేనె తీసుకుని పుండుపై ఆరారగా పెడుతూ వుంటే పుండు తొందరగా మానుతుంది. అన్నింటికీ మించి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా వుండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







