భయపెట్టేస్తానంటోన్న 7జీ బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్.!

- August 09, 2024 , by Maagulf
భయపెట్టేస్తానంటోన్న 7జీ బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్.!

అప్పుడెప్పుడో జ్యోతి కృష్ణ హీరోగా వచ్చిన ‘7జీ బృందావన కాలనీ’ సినిమా గుర్తుంది కదా. తమిళ సినిమా అయినా తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంది అప్పట్లో ఈ సినిమా.
ఇక, ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అయితే కుర్రకారుకు తెగ నచ్చేసింది. ఆమె మరెవరో కాదు, సోనియా అగర్వాల్. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో కనిపించిందంతే. కానీ, ‘7జీ బృందావన కాలనీ’ సినిమా ఇంపాక్ట్ అయితే అలాగే వుండిపోయింది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్, హీరోయిన్ క్యూట్ అప్పీల్.. ఇంకా ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతుంటాయ్.
అసలు మ్యాటర్ ఏంటంటే, అప్పటి కుర్రకారు క్రష్ అయిన ముద్దుగుమ్మ సోనియా అగర్వాల్ ఇప్పుడు దెయ్యంగా మారిపోయింది. అదేనండీ.! దెయ్యం పాత్రలో ఓ సినిమాలో నటించింది. ట్విస్ట్ ఏంటంటే, ఆ సినిమా పేరు కూడా ‘7జీ’నే కావడం విశేషం.
ఈ సినిమా ధియేటర్లలో విడుదలైనా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. ఆగస్టు 9 నుంచి ఈ హారర్ మూవీ ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహాలో స్ర్టీమింగ్ కానుంది. అయితే మొదట తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుందట. ఈ హారర్ థ్రిల్లర్‌ స్టోరీ రెగ్యులరే అయినా సోనియా అగర్వాల్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయ్. చూడాలి మరి, ఓటీటీలో ఎలాంటి రెస్సాన్స్ అందుకుంటుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com