మొదలైన ఖైరతాబాద్ వినాయక చవితి సందడి

- June 16, 2016 , by Maagulf
మొదలైన ఖైరతాబాద్ వినాయక చవితి సందడి

వినాయకచవితి వచ్చిందంటే తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం మెత్తం ఖైరతాబాద్ వినాయకునిపైనే అందరి చూపు ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఒక అవతారంలో భక్తులను కనువిందు చేస్తుంటాడు. అంత ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్‌ భారీ గణపతి విగ్రహ తయారీకి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పూజ చేస ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు, ఉత్సవకమిటీ చైర్మన్‌, స్థానిక కార్పొరేటర్‌ పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు ఏవిధంగా భక్తులకు దర్శనిమిస్తాడో చూడాలంటే సెప్టెంబర్5 వరకు వేచి చూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com