అల్లు అర్జున్ - డిఎస్ పి కాంబినేషన్లో రానున్న మరో ఆల్బమ్
- June 16, 2016
చిత్రపరిశ్రమలో ప్రతీ కాంబినేషన్‌కీ ఓ లెక్క ఉంటుంది. సెంటిమెంట్ అనుకోండి.. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ అనుకోండి.. కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. అదేంటో ఆ కాంబోని ఎన్నిసార్లు చూసినా మనకీ బోర్ కొట్టదు. అలాంటి కాంబినేషన్ అల్లు అర్జున్ - దేవిశ్రీ ప్రసాద్. ఆర్య నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకూ వీళ్లిద్దరి కలయికలో వచ్చిన పాటల్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులోనూ ఆయా సినిమాల్లో ఐటెమ్ పాటలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని నిలిచిపోయాయి. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతోంది. అవును.. అల్లు అర్జున్ కథానాయకుడిగా లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. స్ర్కిప్టు సిద్ధమైంది..
ఇందులో బన్నీ రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఫిక్స్ చేస్తున్నారు. స్వరాల బాధ్యత దేవిశ్రీ కి అప్పగించినట్టు తెలుస్తోంది. సో.. మరో సూపర్ హిట్ ఆల్బమ్‌కి బన్నీ ఫ్యాన్స్ రెడీ అయిపోవొచ్చన్నమాట.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







