ఇండియన్ ఎంబసీ యోగా దినోత్సవం
- June 16, 2016
ఇండియన్ ఎంబసీ, 2వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని అల్ గరాఫా స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ హాల్లో జూన్ 21న నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కల్చరల్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ ఖతార్‌లో పర్యటించినప్పుడు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో యోగాపై చర్చించారు. ప్రపంచం యోగాని ఓ ఆరోగ్యకరమైన ప్రక్రియగా గుర్తించిందనీ, ఆరోగ్యకరమైన సమాజం కోసం ఎంతో ఉపయోగపడుతుంది గనుక, యోగాకు తమ దేశంలోనూ ప్రాచుర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమిర్ షేక్ చెప్పారు. 2015, జూన్ 21న నిర్వహించిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణలో సహకరించినందుకు ఎమిర్ షేక్‌కి నరేంద్రమోడీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇండియన్ ఎంబసీ నిర్వహించే యోగా వేడుకల్లో ఖతారీ డిగ్నిటరీస్కి ఖతార్‌లోని ఇండియన్ అంబాసిడర్ ద్వారా సన్మానం జరగనుంది. అలాగే యోగా ఎక్స్‌పర్ట్‌లచే రూపొందించిన షార్ట్ ఫిలింని ప్రదర్శిస్తారు. యోగా కార్యక్రమానికి స్థానిక వస్త్రధారణ సరిపోతుందని, విజిటర్స్ ఖచ్చిరతంగా తమతోపాటు ఫొటో ఐడి తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







