'హెచ్‌టీటీ-40' గగన విహారం
- June 16, 2016
వాయుసేన ఆధ్వర్యంలో సైనిక శిక్షణ కోసం తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధవిమానం 'హిందూస్థాన్ టర్బో ట్రైనర్-40(హెచ్‌టీటీ-40)' శుక్రవారం లాంఛనంగా గగన విహారం చేయనుంది. రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ సమక్షంలో బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి ఉదయం 9:15 గంటలకు హెచ్‌టీటీ గాలిలోకి ఎగరింది.
భారత వాయుసేనలో సైనిక శిక్షణ నిమిత్తం 2,800 కిలోల బరువైన ఈ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ డిజైన్ చేసింది. మొత్తం 70 హెచ్టీటీలను వాయుసేనకు అందజేయనుంది. ఈ విమానం తయారీ ప్రక్రియ 2012లో ప్రారంభం కాగా, తొలిసారిగా మే 31న గాలిలోకి ఎగిరింది. 2018 నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సైనిక శిక్షణకు ఉపయోగిస్తున్న 38 'హెచపీటీ-32 దీపక్' విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు 34.5 కోట్లు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







