దొంగతనం అడ్డుకున్నందుకు దారుణంగా చంపేసిన ఘటన..
- June 16, 2016
దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులను అడ్డుకున్నందుకు ఒమన్‌లో ఓ భారతీయుడిని దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కేరళకు చెందిన జాన్ ఫిలిప్ 13ఏళ్ల క్రితం ఒమన్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. గత వారం రోజులుగా ఫిలిప్ కనిపించకపోవడంతో సహ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. రాయల్ ఒమన్ స్టేషన్ పరిధిలో రక్తపుమడుగులో ఉన్న ఫిలిప్ మృతదేహాన్ని గుర్తించారు. .
దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిలిప్ పనిచేసే పెట్రోల్‌బంక్‌లో రూ.6.5లక్షల నగదు చోరీ జరిగిందని.. చోరీని అడ్డుకునే క్రమంలోనే దుండగులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు కారణమైన ఆరుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







