అన్న క్యాంటీన్‌లో వారం రోజుల ఫుడ్ మెనూ..
- August 14, 2024అమరావతి: ఏపీలో వేర్వేరు చోట్ల అన్నా క్యాంటిన్లు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రెడీ చేసింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 15న చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు.
అయితే, అన్నా క్యాంటిన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించి మెనూ సిద్ధమైంది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందించనున్నారు. లేదా పూరీ, కుర్మా ఉండనుంది. మంగళవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కానీ, లేదా ఉప్మాతో చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఉండనుంది. గురువారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరీ కుర్మా… శుక్రవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్.. శనివారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ వడ్డించనున్నారు.
మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించనున్నారు. వారంలో ఏడు రోజులు మెను ఇలాగే ఉండనుంది. కానీ, కూర మాత్రం రోజుకో రకంగా ఉండనుంది.
బ్రేక్ ఫాస్ట్లో ఇడ్లీ, పూరీ అయితే, ఒక్కొక్కరికి 3 చొప్పున వడ్డించనున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య ఉండనుంది. మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటిన్ కు సెలవు ఉంటుంది. అలాగే వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్