దొంగతనం అడ్డుకున్నందుకు దారుణంగా చంపేసిన ఘటన..

- June 16, 2016 , by Maagulf
దొంగతనం అడ్డుకున్నందుకు దారుణంగా చంపేసిన ఘటన..

 దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులను అడ్డుకున్నందుకు ఒమన్‌లో ఓ భారతీయుడిని దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కేరళకు చెందిన జాన్‌ ఫిలిప్‌ 13ఏళ్ల క్రితం ఒమన్‌ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. గత వారం రోజులుగా ఫిలిప్‌ కనిపించకపోవడంతో సహ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. రాయల్‌ ఒమన్‌ స్టేషన్‌ పరిధిలో రక్తపుమడుగులో ఉన్న ఫిలిప్‌ మృతదేహాన్ని గుర్తించారు. .
దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిలిప్‌ పనిచేసే పెట్రోల్‌బంక్‌లో రూ.6.5లక్షల నగదు చోరీ జరిగిందని.. చోరీని అడ్డుకునే క్రమంలోనే దుండగులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు కారణమైన ఆరుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com