హైదరాబాద్ లో అతిపెద్ద పోలీస్ కంట్రోల్ కేంద్రం...!!
- June 16, 2016
పోలీస్ వ్యవస్థను అత్యంత అధునాతనంగా మార్చి వారి సేవలని ప్రజలకు మరింత దగ్గర చేయాలని సంకల్పించిన కేసీఆర్ ఆ దిశగా సమాలోచనలు చేశారు. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లపై ప్రధానంగా దృష్టిసారించారు. అత్యంత శక్తివంతమైన సీసీ కెమేరాలను అన్ని కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను సంస్కరించే ప్రాజెక్టుతోపాటు సీసీ కెమేరాల ఏర్పాటు ప్రాజెక్టును బహిరంగ టెండర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. దాదాపు లక్ష సీసీ కెమేరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని పోలీసులు తలపెట్టారు. ఈ నేపథ్యంలో 'ట్విన్ టవర్లను' నిర్మించాలని తలపెట్టారు.
ఈ భవనాల నిర్మాణం కోసం రూ.303 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. సాంకేతిక పరికరాల ఏర్పాటుకు మరో రూ.400 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ట్విన్ టవర్స్‌ను 40 అంతస్తులుగా నిర్మించాలని మొదట అనుకున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఇక్కడ 89 మీటర్ల ఎత్తులో భవనాలను నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 20 అంతస్తుల ఎత్తులో రెండు భవనాలను నిర్మించాలని అనుకుంటున్నామన్నారు. ఇప్పటికే టెండర్లను పిల్చారు. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ టెండర్లను దాఖలు చేశాయి. ఏడాదిన్నరలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించారు.
స్థలం విషయంలో మొదట్లో ఇబ్బంది ఎదురైంది. ఈ స్థలం తనదంటూ ఓవ్యక్తి హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా.. తనకు సరైన జవాబు కూడా ఇవ్వలేదని సంబంధిత వ్యక్తి సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ దరఖాస్తును ఎందుకు తిరస్కరించామన్న దానిపై మాత్రం పూర్తి వివరాలతో సంబంధిత ఫిర్యాదుదారుకు జవాబు ఇవ్వడంటూ సుప్రీం కోర్టు ఆదేశించి విచారణను ముగించిందని అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తికి సమాధానం ఇచ్చాక నిర్మాణాలను మొదలుపెట్టాలని పోలీసులు నిర్ణయించారు. న్యూయార్కు, లండన్ తరహాలో ఇక్కడ అతి పెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు కాబోతోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







