జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

- August 15, 2024 , by Maagulf
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ట్విటర్ వేదికగా.. చంద్రబాబు రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమని చంద్రబాబు అన్నారు. అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com