తొలిసారి జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్
- August 15, 2024
హైదరాబాద్: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ పాట ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం తర్వాత పలు సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనికుల స్మారక స్థూపం వద్దకు వెళ్లారు. అక్కడ పుష్పగుచ్ఛం పెట్టి నివాళి అర్పించారు. అటు తెలంగాణ సచివాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎస్ శాంతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..