13 కోట్ల వసూళ్ళని సాధించిన బిచ్చగాడు..
- June 17, 2016
అది సమ్మర్ సీజన్.. ఓ ప్రక్క ఎండలు, మరో ప్రక్క ఉక్కపోత.. వీటి మధ్య చల్లని వినోదాన్ని అందించేందుకు రెడీ అయిన తెలుగు స్టార్ హీరోలు. కాని ఇలాంటి సమయంలోనే ఎలాంటి అంచనాలు లేకుండా ఓ తమిళ చిత్రం తెలుగులో విడుదలైంది. బిచ్చగాడు పేరుతో విడుదలైన ఈ చిత్రంకు భారీగా ప్రమోషన్స్ చేయకపోయిన కేవలం మౌత్ టాక్ తోనే సంచలనాలు సృష్టించింది. విడుదలైన అన్ని థియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం 50 లక్షల పెట్టుబడితో తెరకెక్కిన బిచ్చగాడు చిత్రం తెలుగులో విడుదలై ఏకంగా 13 కోట్ల వసూళ్ళని సాధించి తెలుగు సినిమా పరిశ్రమని షాక్‌కి గురి చేసింది. తెలుగులో డబ్ అయిన పరాయి భాష చిత్రాలు ఏవి కూడా ఇంత వరకు ఆ రేంజ్ కలెక్షన్లు సాధించలేదని తెలుస్తోంది.శశి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇంత ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విజయ్ ఆంటోని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







