నాని-సుజిత్ కన్ఫామ్ చేసేశాడు.!
- August 18, 2024
నేచురల్ స్టార్‌గా తనకంటూ ఓ స్థాయి స్టార్డమ్ సంపాదించుకున్నాడు నాని. సక్సెస్ వచ్చిందని పొంగిపోలేదు. ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోలేదు. ‘దసరా’ తర్వాత నానికి వరుస విజయాలు బూస్టప్ ఇస్తున్నాయ్.
అదే జోష్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు ఏడాదికి రెండు సినిమాలు వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
మొన్నీ మధ్యనే ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చి కూల్ అండ్ కామ్‌గా హిట్టు పట్టుకెళ్లిపోయాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు.
ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచి అంచనాలున్నాయ్ ఈ సినిమా మీద. ఈ సినిమా తర్వాత ‘హిట్ 3’ వుంది. దాంతో పాటూ, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా వుంది.
ఈ సినిమా విషయంలో కాస్త గందరగోళం నెలకొందన్న ప్రచారం జరిగింది. కానీ, పక్కాగా సుజిత్‌తో సినిమా వుంటుందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాని కన్ఫామ్ చేశాడు.
సుజిత్‌తో సినిమా అంటే నాని రేంజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకున్నట్లే. అంతేకాదు, ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందతోన్న సినిమానే. సో, నాని స్టార్డమ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకోవడానికి ఇంకెంతో టైమ్ పట్టేలా లేదు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







