రవితేజకు డేంజర్ బెల్స్.!
- August 18, 2024
మాస్ రాజా రవితేజకు ఏది పట్టినా వర్కవుట్ కావడం లేదు. ‘ధమాకా’ సినిమా తప్ప ఈ మధ్య రవితేజ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయ్. ‘వాల్తేర్ వీరయ్య’ హిట్ చిరంజీవి ఖాతాలో పడిపోయింది.
లేటెస్ట్‌గా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రిలీజ్‌కి ముందు ఈ సినిమా భారీ అంచనాలే క్రియేట్ చేసింది. కానీ, రిజల్ట్ రవితేజకు అనుకూలంగా రాలేదు.
ఇలాగే జరిగితే మాస్ రాజా రవితేజ కెరీర్ కాస్త కష్టమే అంటున్నారు. కెరీర్ సంగతెలా వున్నా బ్యాడ్ నేమ్ దారుణంగా మూట కట్టుకుంటున్నాడు రవితేజ. కాస్త ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన ఫ్యాన్సే సలహాలిస్తున్నారు.
రిజల్ట్ ఎలా వున్నా.. కథల ఎంపికలో ఒకింత ఆచి తూచి వ్యవహరిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, ‘మిస్టర్ బచ్చన్’ రీమేక్ మూవీ. ఆల్రెడీ సూపర్ హిట్ మూవీ బాలీవుడ్‌లో. కానీ, తెలుగు రీమేక్ విషయానికి వచ్చేసరికి జరిగిన మార్పులు కారణమో.. మరే ఇతర కారణాలో తెలీదు కానీ, దారుణమైన రిజల్ట్ ఇచ్చింది మాస్ రాజాకి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







