అమెరికాలో ఏకంగా 90 అడుగుల అంజనీ పుత్రుడి విగ్రహం
- August 20, 2024
అమెరికా: అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో ఓ భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాదు నాలుగు రోజులు పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఆ విగ్రహాన్ని ప్రారంభించారు. హోస్టన్ నగరంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ ఆంజనేయ స్వామి 90 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరును పెట్టారు. ఇక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహికులు భారీ ఎత్తున నిర్వహించడంతో.. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా., విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కారణంగా హెలికాప్టర్ తో విగ్రహం పై పూల వర్షం కురిపించారు. జై వీర హనుమాన్ అంటూ నగరంలోని అనేక ప్రాంతాలు మార్మోగాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …