ఖతార్ లో గృహ వ్యాపార లైసెన్సింగ్ ఫీజు తగ్గింపు..!
- August 20, 2024
దోహా: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) గృహ వ్యాపారాల కోసం లైసెన్సింగ్ రుసుములను QR300కి తగ్గించింది. "గృహ ఆధారిత వ్యాపారాల లైసెన్సింగ్ ఫీజులు దాదాపు QR1,500 నుండి QR300కి తగ్గించబడ్డాయి. పారిశ్రామికవేత్తలు తమ సూక్ష్మ-వ్యాపారాలను చట్టబద్ధం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు." అని MoCI కమర్షియల్ రికార్డ్స్ మరియు లైసెన్సింగ్ విభాగం అధిపతి లతీఫా అల్ అలీ తెలిపారు. మైక్రో-ఎంట్రప్రెన్యూర్షిప్ మరియు స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ గృహ వ్యాపార కార్యకలాపాలను 15 నుండి 63కి పెంచినట్లు వెల్లడించారు. ప్రతి వ్యాపార కార్యకలాపానికి ప్రత్యేక లైసెన్స్ అవసరమని, వినియోగదారుల భద్రత కోసం తమ వ్యాపారాలను చట్టబద్ధంగా నిర్వహించేందుకు లైసెన్సులను పొందాలని వ్యాపారవేత్తలను కోరారు. అదే సమయంలో స్థానికంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ఇతరులకి ఇబ్బంది కలగకుండా గృహ ఆధారిత వ్యాపార కార్యకలాపాలకు లైసెన్స్‌ను జారీ చేస్తున్నట్లు లతీఫా అల్ అలీ వెల్లడించారు. లైసెన్స్ దరఖాస్తును సింగిల్ విండో పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని, అప్లికేషన్ ఎలక్ట్రానిక్‌గా సమర్పించబడితే, లైసెన్స్ సేవల దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని సేవలకు 90 శాతానికి పైగా రుసుము తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు