కువైట్ స్కూల్ క్యాంటీన్లలో.. ఈ 7 రకాల ఆహార పదార్థాలపై నిషేధం
- August 20, 2024
కువైట్: స్కూట్ క్యాంటీన్లలో జ్యూస్‌లు, పైస్, పాలు, శాండ్విచ్లు, వివిధ రకాల బిస్కెట్లు, క్రాకర్లు, సలాడ్లు మరియు పండ్ల వినియోగం కోసం అనేక రకాల ఆహార ఉత్పత్తులను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అదే సమయంలో ఏడు ఆహార పదార్థాలను విక్రయించడాన్ని నిషేధించింది. ఈ నిషేధిత వస్తువులలో శీతల పానీయాలు, క్యాన్డ్ జ్యూస్‌లు, స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉన్నాయి.
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోసం జనరల్ అథారిటీ స్కూట్ క్యాంటీన్లలో అన్ని రకాల శీతల పానీయాలు, అన్ని క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, స్పోర్ట్స్ డ్రింక్స్ మరియు ఫుడ్స్, ఎనర్జీ డ్రింక్స్ మరియు ఫుడ్స్, చూయింగ్ గమ్, లాలీపాప్‌లు, మిఠాయిలు మరియు స్వీట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ప్రాసెస్ చేసిన మాంసాలు, సాసేజ్లు, ఊరగాయలు, మయోన్నైస్ మరియు ఫ్యాటీ సాస్‌లు వంటివాటి విక్రయాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







