ఎవరీ ఇమాన్వీ ఇస్మాయెల్.? లక్కు నక్క తోక తొక్కిందిగా.!

- August 20, 2024 , by Maagulf
ఎవరీ ఇమాన్వీ ఇస్మాయెల్.? లక్కు నక్క తోక తొక్కిందిగా.!

ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలీదు. అందగత్తెల విషయంలో అది ఇంకా ప్రత్యేకం. తాజాగా అందాల భామ ఇమాన్వీ పేరు ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అందుకు కారణం ఈ అందాల భామ ప్రబాస్ సినిమాలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడమే.

దీన్నే అంటారు ఏకంగా కుంభ స్థలాన్ని కొట్టడమని. అసలింతకీ ఎవరు ఈ ఇమాన్వీ.? జస్ట్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో డాన్సింగ్ వీడియోలు చేసే అమ్మాయి.

పలు డాన్సింగ్  వీడియోలతో పాపులర్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్యాన్ ఇండియా కాదు కాదు యూనివర్సల్ హీరో ప్రబాస్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

అదేనండీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రబాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇమ్మాన్వీ అని అనౌన్స్ చేశారు.

లాంఛింగ్ డేకి అటెండ్ అయిన ఈ ముద్దుగుమ్మ ఎవరా.? అని ఆరా తీస్తే.. అమ్మడి ఇన్‌స్టా అకౌంట్ దర్శనమిచ్చింది. ఏకంగా డెబ్యూ సినిమాకే ప్రబాస్‌ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందంటే పాప లక్కు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com