రష్మిక మండన్నా డబుల్ ధమాకా.!
- August 20, 2024
నేషనల్ క్రష్ రష్మిక మండన్నాకి డిశంబర్ ధమాకా మంత్ కానుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ మంత్లో సెన్సేషనల్ మూవీ ‘పుష్ప 2’ రిలీజ్ కానుంది.
అదొక్కటేనా.? తాజాగా మరో అప్డేట్ వచ్చింది. అదే మంత్లో రష్మిక మండన్నా బాలీవుడ్ మూవీ ‘చావా’ కూడా రిలీజ్ అవుతున్నట్లు తాజా అనౌన్స్మెంట్ వచ్చింది అధికారికంగా.
ఇంతవరకూ డిశంబర్ 6 ‘పుష్ప 2’ రిలీజ్ వుండడంతో మరే ఇతర సినిమా ఆ డేట్లో రిలీజ్ అయ్యేందుకు సాహసం చేయలేదు. కానీ, సడెన్గా ‘చావా’ బాలీవుడ్ మూవీ లైన్లోకి వచ్చింది.
అసలే ‘పుష్ప 2’పై అంచనాలున్నాయ్. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి బాలీవుడ్ టార్గెట్ కూడా పక్కాగా వుంది. అలాంటిది ఈ సినిమాతో పోటీ అంటే నిజంగా గట్స్ వుండాలి.
మరి, ‘చావా’కి అంత గట్స్ ఎందుకంటే కథ, కథనం. ఛత్రపతి శివాజీ హిస్టరీ బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌషల్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఈ హిస్టారికల్ మూవీతో 2పుష్ప 2’, కమర్షియల్ హంగులున్న ‘పుష్ప 2’తో ‘చావా’ పోటీ ఎలా వుండబోతోందో ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఏది ఏమైతేనేం, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం హీరోయిన్ అయిన రష్మికకు అసలు సిసలు ధమాకా పండగలా మారింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







