‘కన్నప్ప’.! అసలు థీమ్ ఏంటప్పా.!

- August 20, 2024 , by Maagulf
‘కన్నప్ప’.! అసలు  థీమ్ ఏంటప్పా.!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకొస్తున్న ‘కన్నప్ప’ సినిమా అసలు ఏ థీమ్‌కి చెందిందో అర్ధం కావడం లేదు. కన్నప్ప అనగానే అందరికీ గుర్తొచ్చేది. పరమ శివుని పవిత్ర భక్తుడు భక్త కన్నప్ప. నిస్వార్ధమైన భక్తునిగా భక్త కన్నప్పను హిందువులు ఆదరిస్తుంటారు.

అయితే, మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏ తరహా మూవీనో అర్ధం కావడం లేదు. ఈ సినిమాలో లెక్కలేనంత మంది నటీ నటులున్నారు. వివిధ భాషల నుంచి వివిధ ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు.

అందులో ప్రబాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితర హేమా హేమీలున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. రెస్పాన్స్ మిక్స్‌డ్‌గా వినిపించిందనుకోండి.

అలాగే, కొన్ని పాత్రల తాలూకు పోస్టర్లు కూడా వచ్చాయ్. చండుడు, ముండుడు తాజాగా కంపడు అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పాత్ర పోషించింది పవర్ ఫుల్ విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ముఖేష్ రిషి. అంత్యంత పురాతనమైన జాతి‘పుళిందులు. సదా శివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారంపర్యంగా పవిత్రమైన వాయులింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతిని భద్ర గణం అని కూడా పిలుస్తారు. ఈ భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు..’ అని ఈయన పాత్రకు తాలూకు ఇన్‌ఫో కూడా ఇచ్చారు.

ఇదంతా చూస్తుంటే అసలు ‘కన్నప్ప’ ఏ తరహా మూవీనో అర్ధం కావడం లేదు. కానీ, భారీ బడ్జెట్ మూవీ ప్యాన్ వరల్డ్ మూవీ అని జరుగుతున్న ప్రచారం వేరే లెవల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com