సెట్స్ పైకి నాగ్ కొత్త చిత్రం
- June 17, 2016
'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తిరస చిత్రాలు అందించిన నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్... మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరి కలయికలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబా జీవితం ఆధారంగా తరకెక్కనున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 29 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాకు సంబంధించి.. కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. తాజాగా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంపిక పూర్తిచేసిన చిత్రయూనిట్..
29 నుంచి షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. హాథీరామ్ బాబాగా నాగార్జున ప్రధానపాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలకపాత్రలు పోషించబోతున్నారు. సన్యాసినిగా అనుష్క, శ్రీదేవి అమ్మవారి పాత్రలో విమలా రామన్, మరో కీలక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







