మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.!
- August 22, 2024
ఆగస్టు 22 ఓ మెగా పండుగ. ఎందుకంటే, ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు సినిమా చరిత్రనే మార్చేసిన నటుడు చిరంజీవి.
అవార్డులు, స్టార్‌లు ఆయన ముందు చేరి గర్వపడుతుంటాయ్.. అదీ చిరంజీవి అంటే. ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి. అలాంటి ఆయన బర్త్‌డేను అభిమానులు నిజమైన పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ప్రతీ ఏడాది.
చిరంజీవి అంటే వ్యక్తి కాదు, హీరో అంతకన్నా కాదు. ఆయన ఓ స్పూర్తి. ఆ స్పూర్తితో ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో ఎంతో మంది జీవిత పాఠాలు నేర్చుకుంటుంటారు.
అలాంటి చిరంజీవి ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే వుండాలని ఆశిస్తూ మనం కూడా బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే టు యు చిరంజీవి.
ఇక, ఆయన సినిమాల అప్డేట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారాయన. 200 కోట్ల బడ్జెట్‌తో ఇంతవరకూ చిరంజీవి నటించిన సినిమాల్లో లేని అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘చెడు, చీకటి ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఓ అద్భుతమైన తార వాటితో పోరాడేందుకు ప్రకాశిస్తుంది..’ అంటూ చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపిస్తున్న చిరంజీవి పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు