బలగం వేణు - నాని కాంబో సినిమా.! ట్విస్ట్ రిలీజ్ చేసిన నాని.!
- August 22, 2024
నటుడిగా, కమెడియన్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న వేణు ‘బలగం’ అనే సినిమాతో దర్శకుడిగానూ సత్తా చాటాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా.
ఆ తర్వాత వేణు, నానితో ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జోరందుకుంది. అయితే, అనుకోకుండా ఓ డిస్కషన్‌లో వేణుతో సినిమా చేయాలని వుందని నాని చెప్పాడట. అంతే, కానీ, ఈ కాంబినేషన్‌లో సినిమా ఓకే కాలేదనీ నిజంగా వేణు కథ తీసుకొస్తే.. తనతో పని చేయడానికి సిద్ధంగా వున్నానని నాని లేటెస్ట్‌గా చెప్పాడు.
జస్ట్ అలా పొక్కిన మాట.. రూమర్‌లా పాకేసింది. ఏమో, కథ దొరికితే త్వరలోనే ఈ రూమర్ నిజమైనా అవుతుంది. ఇక, మరికొద్ది రోజుల్లో నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.
కూల్ అండ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ, నానితో చేసిన ఓ మాస్ ప్రయోగమే ‘సరిపోదా శనివారం’. ప్రచార చిత్రాలు బాగున్నాయ్. క్షణం కూడా తీరిక లేకుండా నాని ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఎస్.జెసూర్య విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







