మెగా ఫ్యాన్స్‌ని మళ్లీ కెలికిన అల్లు అర్జున్.!

- August 22, 2024 , by Maagulf
మెగా ఫ్యాన్స్‌ని మళ్లీ కెలికిన అల్లు అర్జున్.!

మెగా ఫ్యామిలీ హీరోగానే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తర్వాతర్వాత తనకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. వచ్చింది కూడా.

అయితే, ప్రతీసారి తానే పెద్ద తోపు.. అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక రకంగా మెగా ఫ్యాన్స్‌ని కెలుకుతూనే వుంటాడు అల్లు అర్జున్. తనదైన పబ్లిసిటీతో తన ఫ్యాన్స్‌ని మెగా ఫ్యాన్స్ నుంచి సెపరేట్ చేసుకున్నాడు కూడా.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఇండస్ట్రీ అంతా సందడిగా వుంటే, మరోసారి తన నోటి దురద తీర్చుకున్నాడంటూ బన్నీపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి హాజరైన అల్లు అర్జున్ అక్కడ తన మనసుకు నచ్చిన వాళ్ల దగ్గరకు ఎప్పుడైనా వెళతా.. చాలా మంది హీరోలకు అభిమానులుంటారు. కానీ, నేను మాత్రం అభిమానుల కోసమే హీరో అయ్యా..’ అంటూ కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా మాట్లాడాడు.

కావాలనే అలా మాట్లాడాడో.. లేదా వక్రీకరణకు గురయ్యాయో తెలీదు కానీ, బన్నీ తీరు మాత్రం ప్రతీసారి ఇలాగే వుంటుంది.. ఈ వివాదాస్పద వ్యాఖ్యల్ని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ కళ్యాణ్‌కి అపోజేషన్ వ్యక్తిని కలవడం ద్వారా జరిగిన రచ్చకు ముడిపెట్టి మరింత వివాదాస్పదం చేస్తున్నారు నెటిజన్లు.

దాంతో, మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ టాపిక్ డైవర్ట్ అయిపోతోంది.. అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ మధ్య బన్నీపై నెగిటివిటీ మామూలుగా లేదు. అలాంటిది కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి కదా.. అని సినీ పెద్దలు కొందరు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com