బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందిగా.!
- August 22, 2024
బుల్లితెర అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ గేమ్ షో మొదలయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మధ్య ప్రోమోలతో ఊదరగొడుతున్న బిగ్‌బాస్ టీమ్ ఫైనల్లీ టెలికాస్ట్ డేట్ ఫిక్స్ చేసింది.
సెప్టెంబర్ 1 నుంచి ఆట మొదలు కానుంది. హౌస్‌లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ల విషయంలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయ్. మరి కొద్ది రోజుల్లోనే ఆ రూమర్లకు చెక్ పడిపోనుంది.
సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి మూడు గంటల పాటు షో స్టార్ట్ కానుంది. ఆ తర్వాత (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) నుంచి రాత్రి 10 గంటలకు ఎడిటెడ్ వెర్షన్ ప్రసారం కానుంది.
అలాగే లైవ్ షో కూడా అందుబాటులో వుండనుంది. ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు..’ అనే క్యాప్షన్‌తో ప్రోమోలు ఊదరగొడుతున్నారు. అయితే, షోలో విషయం ఏపాటిదనేది రెండు మూడు రోజులు చూశాకా ఆడియన్స్ డిక్లేర్ చేసేస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







