వెల్లుల్లికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి వుందా.?

- August 22, 2024 , by Maagulf
వెల్లుల్లికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి వుందా.?

వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయ్. వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకునేవారిలో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా వుంటుందని తాజా సర్వేలో తేలింది.

వెల్లుల్లితో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. అంతేకాదు, విటమిన్ సి,బి,కె, జింక్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్ పుష్కలంగా వుంటాయ్.

అందుకే వెల్లుల్లిని బాడీలో డిసీజ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. డైలీ రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే దీర్ఘకాలిక వ్యాధులు.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరకుండా వుంటాయట.

అలాగే, గుండె, మెదడు ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు నుంచి ఉపశమనం పొందాలంటే వెల్లుల్లిని ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

డైరెక్ట్‌గా కాకున్నా వెల్లుల్లిని కూరల్లో రెగ్యులర్‌గా వాడొచ్చు. చాలా మందికి వెల్లుల్లి వాసన గిట్టదు. వెల్లుల్లిని కూరల్లో కనిపించినా తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ, ఆ అలవాటు మార్చుకోవాలనీ, రోగ నిరోధక శక్తి రావాలంటే ఖచ్చితంగా వెల్లుల్లిని తినాలని చెబుతున్నారు.

వెల్లుల్లిని మెత్తగా చితక్కొట్టి టీలో వేసి, ఆ టీని తాగితే చాలా మంచిదని చెబుతున్నారు. కొంచెం కష్టమే అయినా వెల్లుల్లి టీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com