ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి..
- August 23, 2024
బాగ్దాద్: ఇరాక్‌లో జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు..కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రాజమల్లు గత ఏడు సంవత్సరాల క్రితం ఇరాక్ దేశానికి బతుకుతెరువు కోసం వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈక్రమంలో గురువారం కంపెనీకి పనికి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదంలో రాజమల్లు చెందాడు.
ఇరాక్‌లోని రాజమల్లుతో పాటు పనిచేసే వారు ఈ సమాచారాన్ని తండ్రి పెద్ద మల్లయ్య తల్లి రాజవ్వలకు తెలిపారు. దీంతో చింతగూడ గ్రామంలో రాజమల్లు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజమల్లు మృతితో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. తన కుమారుని శవాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని పెద్ద మల్లయ్య తల్లి రాజవలు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







