సినిమా రివ్యూ: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’.!
- August 23, 2024
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రమే ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ భార్య సమర్పకురాలిగా వ్యవహరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించడం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆహ్వానించడం.. ఇలా ఈ సినిమాని ప్రమోట్ చేసిన విధానం నెక్స్‌ట్ లెవలే అని చెప్పొచ్చు. అలా పబ్లిసిటీ పరంగా పెద్ద సినిమాల లిస్టులో చేరిన ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’కి ఆ రేంజ్ సీనూ, సినిమా రిలీజ్ తర్వాత వుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మారుతి నగర్‌లో నివసించే ఓ మధ్య తరగతి వ్యక్తి సుబ్రహ్మణ్యం (రావు రమేష్). అలా ఆయనకు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఐడెంటిటీ పైగా నిరుద్యోగి. చేస్తే గీస్తే గవర్నమెంట్ వుద్యోగమే చేస్తా.. అంటూ భీష్మించుకుని కూర్చుంటాడు. ఎట్టకేలకు ఓ గవర్నమెంట్ వుద్యోగం వచ్చినప్పటికీ అది కాస్తా కోర్టు గొడవల్లో ఇరుక్కని, పోతుంది. అలా భార్య కళా రాణి (ఇంద్రజ) సంపాదన మీదే బతుకుతూ ఏకంగా 25 ఏళ్లు కాలం గడిపేస్తుంటాడు. ఆయనకు అర్జున్ (అంకిత్) అనే కొడుకు. తొలి చూపులోనే కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కొడుకు ప్రేమను గెలిపించడానికి కాంచన ఇంటికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఓ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఆయన అకౌంట్‌లోకి 10 లక్షలు వచ్చి పడతాయ్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ ఆ అనూహ్యమైన డబ్బు ఎవరిది.? ఆ డబ్బంతా ఖర్చయిపోయాకా సుబ్రహ్మణ్యం పరిస్థితి ఎలాంటి మలుపులు తిరిగింది.? అసలింతకీ కాంచన ఇంట్లో ఏం జరిగింది. కోరుకున్న అమ్మాయితో కొడుకు పెళ్లి జరిపించగలిగాడా సుబ్రహ్మణ్యం.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
మంచి తండ్రిగా, స్నేహితుడిగా, పవర్ ఫుల్ అండ్ కామెడీ విలన్‌గా రకరకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన నటుడు రావు రమేష్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలవోకగా వేసే పంచ్ డైలాగులతో తన పాత్రను మరింత హిలేరియస్‌గా తీర్చి దిద్దుకున్నాడు. ఆధ్యంతం సినిమాని బోర్ కొట్టించకుండా వన్ మ్యాన్ షోలా నడిపించాడు. సగటు మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాల్ని తన పాత్ర ద్వారా ఫన్ టోన్‌లో చెప్పడంలో వందకు వంద మార్కులేయించుకున్నాడు రావు రమేష్. ఆయన భార్యగా ఇంద్రజ తన అనుభవాన్ని చూపించింది. యంగ్ క్యారెక్టర్స్ అంకిత్, పసుపులేటి రమ్య తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు లక్షణ్ కార్య తీసుకున్న కథ, కథాంశం ప్రతీ మిడిల్ క్లాస్ పర్సన్‌కీ కనెక్ట్ అయ్యే అంశం. ఆ అంశాన్ని సెంటిమెంటల్ మోడ్‌లో కాకుండా.. అక్కడక్కడా భావోద్వేగాలు పలికిస్తూనే సగటు ప్రేక్షకుడు సినిమాని సినిమాలా ఫీలయ్యేలా చూస్తున్నంతసేపూ హాయిగా నవ్వుకునేలా మలిచాడు. ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. చివరి వరకూ అదే టెంపో కొనసాగించడం సినిమాకి హైలైట్. సెకండాఫ్‌లో కాస్త స్లోగా అనిపించినా ఆసక్తి మాత్రం సన్నగిల్లదు. ఓ వైపు కామెడీ పండిస్తూనే భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆయా క్యారెక్టర్లతో పలికించిన డైలాగులు ఆకట్టుకుంటాయ్. సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలకు తగ్గట్లుగా వుంది. అక్కడక్కడా ఎడిటింగ్ కాస్త కత్తెర పడొచ్చు. మ్యూజిక్ సినిమాకి తగ్గట్లుగా వుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బడ్జెట్‌కి లోబడి బాగుందనిపించేలా చేశారు.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం నడిపించిన తీరు.. కామెడీ, పంచ్ డైలాగులు, రావు రమేష్ పర్‌ఫామెన్స్..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు, డల్‌గా అనిపించిన కథనం.
చివరిగా:
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మిడిల్ క్లాసే అయినా హై క్లాస్‌లో నవ్వులు పూయిస్తాడు.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







