సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
- August 26, 2024
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ పటిష్టత, బలోపేతంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అడ్‌హక్ కమిటీలు రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆదివారం సమావేశం అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలుగుదేశం తెలుగు ప్రజలందరి కోసం పని చేస్తుందని చంద్రబాబు తెలిపారు. పార్టీని, తనను గత 45 ఏళ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. అందుకు తగినట్లే పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు. తనపై ఇప్పుడు రెండు బాధ్యతలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఏపీలో ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని గుర్తు చేశారు.
ఇకపై తెలంగాణకు ప్రతి 15 రోజులకొకసారి వస్తానని చంద్రబాబు కార్యకర్తలకు చెప్పారు. అందరి కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని.. అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష