7,50,000 KD విలువైన 60 కిలోల డ్రగ్స్ సీజ్..!
- August 26, 2024
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ ద్వారా యూరోపియన్ దేశం నుండి కువైట్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. ఐదుగురు నిందితులతో కూడిన క్రిమినల్ ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. వారిలో ఇద్దరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్‌లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. వారు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించారని వెల్లడించారు. నిందితుల వద్ద సుమారు 60 కిలోల గంజాయి మరియు హషీష్ స్వాధీనం చేసుకున్నట్టు, దీని మార్కెట్ విలువ 750,000 కువైట్ దినార్లు ఉంటందని తెలిపారు.నిందితులందరినీ మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను డ్రగ్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







