కంటైనర్ హ్యాండ్లింగ్..ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో సౌదీ అరేబియా

- August 26, 2024 , by Maagulf
కంటైనర్ హ్యాండ్లింగ్..ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో సౌదీ అరేబియా

జెడ్డా: ప్రపంచంలోని 'లాయిడ్స్ లిస్ట్ వన్ హండ్రెడ్ పోర్ట్స్' ఇటీవల విడుదల చేసిన 2024 ఎడిషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానం నుండి 15వ స్థానానికి ర్యాంకింగ్‌ను సౌదీ అరేబియా పెంచుకుంది.సౌదీ అరేబియా తమ ఓడరేవులను అంతర్జాతీయ రేంజీలో బలోపేతం చేసిందని నివేదికలో వెల్లడించారు.గత సంవత్సరంలో సుమారు 5.6 మిలియన్ స్టాండర్డ్ కంటైనర్‌లను రికార్డ్ చేయడం ద్వారా జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 41 నుండి 32 వ స్థానానికి చేరుకుంది.

సౌదీ పోర్ట్స్ అథారిటీ (MAWANI) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కింగ్ అబ్దుల్లా పోర్ట్ కూడా 2022లో 2.905 మిలియన్ కంటైనర్‌లతో పోలిస్తే 2.93 మిలియన్ స్టాండర్డ్ కంటైనర్‌లను నమోదు చేసి 71వ స్థానం నుండి 70వ స్థానానికి చేరుకుంది.డమ్మామ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ గత సంవత్సరం 2.305 మిలియన్ స్టాండర్డ్ కంటైనర్‌లను నమోదు చేసి 90వ స్థానం నుండి 82వ స్థానానికి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com