ఇప్పుడు ఓకే.! అప్పుడంత ఈజీ కాదుగా ‘రాజాసాబ్’.!
- August 27, 2024
‘కల్కి’ దాదాపు 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా లెక్కలు తేల్చేశారు. అంతా బాగానే వుంది. కానీ, ‘కల్కి’ సినిమాకి అంత సీనుందా.? అంటే ఏదో కష్టపడ్డారు. బ్లాక్ బాస్టర్.. అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా ప్రబాస్ లిస్టులో వేసేశారు.
అయితే, నిజంగా ‘కల్కి’ అన్ని వసూళ్లు సాధించిందా.? అంటే ఆ విషయం పెరుమాళ్లకెరుక. ఇక, వచ్చే ఏడాది ప్రబాస్ నుంచి ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ కానుంది.
ఇది హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏప్రిల్ 10 2025లో రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ అనేది ఎలాగూ సమ్మర్. ఖచ్చితంగా వర్కవుట్ అయ్యే సీజనే.
సో, ప్రబాస్‌కి ఖచ్చితంగా వర్కవుట్ అయిపోవడం పక్కా. అయితే, అదే రోజు కన్నడ హీరో ‘కేజీఎఫ్’ పేమ్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా కూడా రిలీజ్ కానుంది. ‘‘కేజీఎఫ్’ సినిమాతో యష్ తెచ్చుకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.? చెప్పక్కర్లేదు.
ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ విజయం అందుకున్న సినిమా అది. ఆ సినిమా తర్వాత భారీ అంచనాలతో యష్ నుంచి వస్తున్న సినిమానే ‘టాక్సిక్’. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా టార్గెట్‌గా రిలీజ్ అవుతోంది ఈ సినిమా.
అందులోనూ ప్రబాస్‌కి పోటీగా వస్తోంది. మరేంటి సంగతి. ప్రబాస్ - మారుతి సినిమా ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. చూస్తుంటే, ‘రాజాసాబ్’కి అంత ఈజీ కాదనిపిస్తోంది. మరి, ఆ డేట్ కాకుండా ‘రాజాసాబ్’ కాస్త అటూ ఇటూ ఏమైనా తగ్గే అవకాశాలున్నాయా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు