అక్కడ హిట్టు కొట్టాలంటే ఆ మాత్రం వుండాలండీ నానీ గారూ.!
- August 27, 2024
నేచురల్ స్టార్ నాని ఈ వారం ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఓ ఫెయిల్యూర్ కాంబినేషన్ అయినప్పటికీ తిరుగులేని కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా చేశారు. ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘దసరా’ రేంజ్ హిట్టు కొడతాడన్న నమ్మకం అందరిలోనూ వుంది. అంతేకాదు, ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తుండడం మరో విశేషం.
బాలీవుడ్‌లో ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు వెళ్లిన నానికి అక్కడ మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు తలెత్తాయ్. వాటన్నింటికీ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చుకుంటూ వచ్చాడు నాని.
అలాగే హీరో అవ్వడానికి స్పూర్తినిచ్చిన వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరనీ అయన చెప్పారు. అలాగే, అమీర్ ఖాన్ సినిమాలంటే తనకెంతో ఇష్టమనీ, అమితాబ్ నటించిన ‘అగ్నిపథ్’, అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ ప్రస్థావన తీసుకొచ్చాడు నాని.
ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో పవర్ ఫుల్ విలనిజం ప్రదర్శించనున్నాడు.
విలన్ పాత్ర ఎంత పవర్‌గా వుంటే, హీరో పాత్ర అంత ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. కూల్ సినిమాలు చేసే వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి ఓ సినిమాని ఊహించలేం. ఎలా డీల్ చేశాడన్నది తెలియాలంటే ఈ నెల 29 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







