జూన్ 21న యోగా అవేర్‌నెస్ డ్రైవ్
- June 18, 2016
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. దీనికోసం కింగ్‌డమ్ సమాయత్తమవుతోంది. పౌరులకు యోగా పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలేహ్ నేతృత్వంలో జరగనున్న ఈ ఈవెంట్‌ని జూన్ 21 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సెగాయాలోని ప్రిన్సెస్ అల్ జవహరా ఇబ్రహీమ్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్ లో నిర్వహిస్తారు. ఇండియన్ ఎంబసీ మరియు ప్రిన్సెస్ అల్ జవహరా సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్ అండ్ ఇన్‌హెరిటెడ్ డిసార్డర్స్ ఈ కార్యక్రమానికి మద్దతు పలికాయి. ఉదయం 11 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి) ఈ వివరాల్ని ప్రెస్‌మీట్‌లో వెల్లడించింది. హెల్త్ మినిస్టర్ యోగా దినోత్సవం రోజున ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమంలో పాల్గొనదలచినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పాల్గొన్నవారికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రచురించిన యోగా టెక్నిక్స్ బుక్‌లెట్, అలాగే యోగాపై ఓ సీడీ అందజేస్తారు. ఇందులో హైపర్‌టెన్షన్‌కి సంబంధించి అవగాహన కల్పించేందుకు వీలుగా ఓ లీఫ్‌లెట్‌ని పొందుపర్చారు
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







