5,000 దిర్హామ్‌లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!
- August 29, 2024
యూఏఈ: యూఏఈ ప్రకటించిన రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబరు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో స్కామర్లు తప్పుడు ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు రెసిడెన్సీ వీసాల పేరిట మోసపూరిత ఆఫర్లతో ప్రవాసులను మభ్యపెడుతున్నారు.5,000 దిర్హామ్‌లకు రెసిడెన్సీ వీసాలను అందిస్తామని తమను కొందరు సంప్రదించారని జెబెల్ అలీ, సోనాపూర్లలో నివసిస్తున్న కొద్ది మంది నివాసితులు తెలిపారు.చాలా కాలంగా దేశంలో నివసిస్తున్న నివాసితులు ఎలాగైన రెసిడెన్సీ సంపాదించి యూఏఈలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశలను కొందరు సొమ్ము చేసుకునేందుకు తప్పుడు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టబద్ధమైన రెసిడెన్సీ వీసాను పొందడానికి అసలు ఖర్చు Dh5,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సెవెన్ సిటీ డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్‌కు చెందిన మహ్మద్ దావూద్ షాబుద్దీన్ మాట్లాడుతూ..స్కామర్లు క్షమాభిక్ష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్స్టేయర్లను నకిలీ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఏజెంట్లతో లేదా నేరుగా ప్రభుత్వ అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరపాలని కోరారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు