దుబాయ్ ప్రమాదం..పిల్లలకు ప్రాణాంతకంగా అక్రమ రవాణా..!
- August 29, 2024
దుబాయ్: డబ్బు ఆదా కోసం అక్రమ రవాణా సేవలను ఉపయోగించకుండా వారి పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావేత్తలు తల్లిదండ్రులను కోరుతున్నారు. మంగళవారం హట్టా-లహబాబ్ రహదారిపై వాహనం బోల్తా పడిన ఘటనలో దుబాయ్ పాఠశాలకు చెందిన 7 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడిన సంఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు.
అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ.. సుశిక్షితులైన సిబ్బంది ఉన్నందున పాఠశాల బస్సులు సేఫ్ అని సిఫార్సు చేస్తామన్నారు. బస్సు సిబ్బంది అందరూ షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వంటి నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందారని, భద్రతా ప్రోటోకాల్‌లు ఖచ్చితంగా పాటిస్తారని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఉండదని, కొంతమంది డ్రైవర్లు తమ వాహనాల్లో పిల్లలతో కిక్కిరిసి తీసుకుపోతారని తెలిపారు. ఇది ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







