సాలిక్ టోల్ గేట్ రేటు.. 'డైనమిక్ ప్రైసింగ్' అమలు..!
- August 29, 2024
దుబాయ్: దుబాయ్ టోల్ గేట్ సిస్టమ్‌కు డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అవసరమని అధ్యయనాలు చెబుతున్నందున Dh4 రేటును త్వరలోనే మార్చే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “డైనమిక్ ప్రైసింగ్ కోసం, భవిష్యత్తులో డైనమిక్ ధరలను అమలు చేసే అవకాశం గురించి ఈ సంవత్సరం ప్రారంభంలో RTA నుండి ఒక ప్రకటన చేసింది. ఇది అమలు ప్రారంభానికి సమయం లేదా తేదీని సెట్ చేయలేదు. కానీ అధ్యయనాలు Dh4 ట్రాఫిక్ ను తగ్గించలేదని చెబుతుంది. డైనమిక్ ధరను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ఇది రోజు సమయాన్ని బట్టి మారుతుంది. రోజులోని నిర్దిష్ట సమయాల్లో సుంకం మినహాయింపు ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది.”అని సాలిక్ CEO ఇబ్రహీం అల్హద్దాద్ అన్నారు. దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం కోసం వెళ్లే ముందు వివరాలు, ఆర్థిక ప్రభావాన్ని సాలిక్ సమీక్షిస్తుందని ఆయన తెలిపారు.అంతకుముందు ఎమిరేట్ రోడ్లపై రద్దీని తగ్గించడానికి "డైనమిక్ ప్రైసింగ్"ను ప్రవేశపెట్టవచ్చని సలిక్ తన IPO ప్రకటనలో వెల్లడించింది."డైనమిక్ ప్రైసింగ్" విధానంలోట్రాఫిక్ లేని సమయాలతో పోలిస్తే వాహనదారులకు ఎక్కువ ఛార్జీ విధించబడుతుంది. ప్రపంచంలోని అనేక ప్రధాన నగరాలు డైనమిక్ టోల్ ప్రైసింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







